దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ఆనందోబ్రహ్మ చిత్రం ఫేమ్ మహీ రాఘవ దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9 నుండి చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. నిన్న మూవీ టైటిల్ లోగో విడుదల చేసిన మేకర్స్ కొద్ది సేపటి క్రితం చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో మమ్ముట్టి ..వైఎస్ఆర్ స్టైల్‌లో చేయీ పైకెత్తి అభివాదం చేస్తున్నారు. ఈ పోస్టర్ అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. ఇక పోస్టర్ పై ఒక్క అడుగుతో చర్రిత సృష్టించే బదులు.. జనాల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అనే ఇంగ్లీష్ కాప్షన్ .. ‘కడప దాటీ ప్రతీ గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడవాలనుంది. మీ గుండెచప్పుడు వినాలనుంది’.. అన్న సందేశం అభిమానులని ఆకట్టుకుంటుంది.
70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 30 కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. గతంలో రౌడీ కూలీ, సూర్య పుత్రులు, స్వాతి కిరణం వంటి తెలుగు చిత్రాల్లో నటించిన మమ్ముట్టి పాతికేళ్ల తర్వాత యాత్ర మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. చిత్రంలో ఫీమేల్ లీడ్‌తో పాటు జగన్ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది.