ఫైనాన్స్‌ ఇస్తామని చెప్పి యువ‌తిపై అత్యాచారం!

386
Rape of a young woman saying give finance!

ఓ యువ‌తి ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు తాము బ్యాంక్ ఉద్యోగుల‌మ‌ని పరిచయం చేసుకున్నారు.

తర్వాత తమ బ్యాంకు నుంచి ఫైనాన్స్‌ ఇస్తామని యువతితో మాట‌లు క‌లిపారు.

అనంత‌రం వారిలో ఓ వ్యక్తి ఇంటి బయటకు వెళ్లి కాపలా ఉన్నాడు. మరో వ్యక్తి ఇంట్లో యువతితో మాట్లాడుతూ ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట, డీఎస్‌ మక్తాలో జరిగిన ఈ ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఒంటరిగా వున్న ఓ యువ‌తి ఇంట్లోకి వచ్చిన ఓ వ్య‌క్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. త‌న‌ కుటుంబ సభ్యులు మహారాష్ట్రకు వెళ్లగా ఓ అమ్మాయి(23) ఇక్క‌డే ఒంట‌రిగా ఇంట్లోనే ఉంటోంది.

ఈ విష‌యాన్ని గుర్తించిన ఇద్ద‌రు వ్య‌క్తులు నిన్న సాయంత్రం ఆమె ఇంటికి వ‌చ్చి యువతితో మాట్లాడుతూ ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

అనంత‌రం ఈ ఘటనపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఆమెను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.