ఓ యువతి ధైర్య సాహసాలతో ఏటీఎం లో చోరీకి యత్నించిన ఓ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాయి.
ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయ్ ఏరియాలోగల వాలివ్ లొకాలిటీలో గురువారం జరిగింది.
ఏటీఎం కేంద్రంలో దొంగను చూడగానే సదరు యువతి ధైర్యంగా షట్టర్ దించి, పోలీసులకు సమాచారం అందించింది.
వెంటనే వాళ్లు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వాలివ్ లొకాలిటీకి చెందిన ఓ 26 ఏండ్ల మహిళ గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో స్థానికంగా ఉన్న ఓ కేంద్రం నుంచి శబ్దం రావడం గమనించింది.
దాంతో ఏటీఎం కేంద్రం దగ్గరికి వెళ్లి చూడగా అందులో ఓ వ్యక్తి ఏటీఎం మిషన్‌ను పగులగొడుతూ కనిపించాడు.
వెంటనే ఆ మహిళ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏటీఎం కేంద్రం షట్టర్‌ను మూసేసి, పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు.