మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్!

360
Locked down again in Maharashtra!

మహారాష్ట్రలో కరోనా విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చడంతో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది.

ఇందులో భాగంగా నిన్న నాగ్ పూర్ జిల్లాలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

మరి కొన్ని జిల్లాల్లో కూడా లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిన్న ప్రకటించారు.

కేసులు పెరుగుతున్న దృష్ట్యా మహా ప్రభుత్వం ఈరోజు మరిన్ని కీలక చర్యలు తీసుకుంది.

అకోలా, పర్బణి లాక్ డౌన్ విధించింది. అలాగే పూణెలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.

అకోలాలో ఈ రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ప్రకటించింది.

పూణెలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూని విధించారు.

కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ బంద్ అవుతాయి. స్కూళ్లు, కాలేజీలను మార్చి 31 వరకు మూసివేశారు.

పర్బణి జిల్లాలో ఈ రాత్రి 12 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు మహారాష్ట్ర కేబినెట్ మినిస్టర్ నవాబ్ మాలిక్ తెలిపారు.