జబర్ధస్త్‌, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో కోతలు

259

త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మంది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న టీవీ షోల‌లో జ‌బ‌ర్ద‌స్త్ ఒక‌టి. ఆ అభిమానులే ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌ను కూడా ఆద‌రించారు.

టీవీతో పాటు ఇతర మాధ్యమాల్లోనూ ఈ షోల‌ను వీక్షించేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఆడియెన్స్‌లో జబర్ధస్త్‌‌కు ఉన్న క్రేజ్ కారణంగానే ఎక్స్‌ట్రా జబర్ధస్త్ పుట్టుకొచ్చింది.

కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించడంలో విజ‌య‌వంత‌గా దూసుకుపోతున్న ఈ రెండు కార్యక్రమాల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది.

ఇప్పటివరకు కామెడీ స్కిట్స్‌ విషయంలో ఈ రెండు కార్యక్రమాల్లో ఎప్పుడు తగ్గుదల కనిపించలేదు.

ఒకరిద్దరి స్కిట్స్‌ ప్రేక్షకులను అంతగా మెప్పించకపోయినప్పటికీ.. వారిని ఎప్పటిలాగానే కంటిన్యూ చేస్తూ వస్తోంది జబర్ధస్త్ మేనేజ్‌మెంట్. అయితే తాజా ఎపిసోడ్స్‌లో మాత్రం స్కిట్స్‌‌లో కోత పెట్టడం కనిపించింది.

గతంలో ఒక్కో ఎపిసోడ్‌లో ఆరు స్కిట్స్ ఉండగా ఇటీవల ప్రసారమైన జబర్ధస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లలో ఐదు స్కిట్స్‌ మాత్రమే ఉన్నాయి.

అంతకుముందు గంటన్నర పాటు ఉన్న ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు గంటకు పరిమితం చేశారు. మిగతా అరగంటలో పాత స్కిట్స్‌ను బెస్ట్ ఆఫ్ జబర్ధస్త్‌ పేరుతో టెలికాస్ట్ చేస్తున్నారు.

అయితే ఉన్నపళంగా జబర్ధస్త్‌, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో ఈ మార్పు ఎందుకు వ‌చ్చంద‌నే దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

అయితే ఆడియెన్స్‌ను మెప్పించలేకపోతున్న కొన్ని టీమ్స్‌ను పక్కనపెట్టి వారిని మిగతా టీమ్స్‌లో కలిపేశారనే టాక్ వినిపిస్తోంది.

మరోవైపు స్కిట్స్‌ను తగ్గించడం వెనుక కాస్ట్ కట్టింగ్ వ్యూహం ఏమైనా ఉందా అనే చర్చ కూడా జ‌రుగుతోంది.

కారణం ఏదేమైనా ‌జబర్ధస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లలో వచ్చిన అనూహ్య మార్పుల వల్ల ఇప్పటికిప్పుడు వాటిపై ప్రభావం ఉండకపోవచ్చనే చ‌ర్చ జ‌రుగుతోంది.

అయితే దీన్ని జబర్ధస్త్ యాజమాన్యం ఇలాగే కొనసాగిస్తుందా లేక పాత ఫార్మాట్‌లోకి మారిపోతుందా అన్నది తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.