పిల్లల పేరుతో ఈ పాలసీ తీసుకుంటే మనీబ్యాక్

173

త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల కోసం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంటారు. అంతేకాదు వారి భ‌విష్య‌త్తు కోసం ఎన్నో సేవింగ్స్ చేస్తుంటారు.

పిల్ల‌ల చ‌దువులు కావ‌చ్చు లేదా వారి పెళ్లిల్లు కావ‌చ్చు.

త‌ల్లిదండ్రుల‌ను ఆక‌ట్టుకునేందుకు అనేక సంస్థ‌లు ప‌లు ర‌కాల పొదుపు ప‌థ‌కాల‌ను తెస్తుంటాయి.

ఈ క్ర‌మంలోనే లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

ఇది మనీ బ్యాక్ పాలసీ. అంటే పిల్లల చదువు, పెళ్లిళ్లు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని మ‌నం కోరుకున్నట్టుగా మనీ బ్యాక్ పొందొచ్చు.

ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, లైఫ్ ఇన్ష్యూరెన్స్, సేవింగ్స్ ప్లాన్. పిల్లలు పుట్టిన వెంటనే ఈ పాలసీ తీసుకోవచ్చు.

కనీసం రూ.1,00,000 ఇన్ష్యూరెన్స్ ఈ పాలసీని తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఎవ‌రైనా పిల్లల పేరుపై ఈ పాలసీని తీసుకోవచ్చు.

ఉదాహరణకు రూ.1,00,000 ఇన్ష్యూరెన్స్‌ను అప్పుడే పుట్టిన పిల్లలకు రూ.4327 ప్రీమియం చెల్లించాలి.

5 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.5586 ప్రీమియం.

10 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.7899 ప్రీమియం, 15 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.9202 ప్రీమియం చెల్లించాలి. గరిష్ట వయస్సు- 12 ఏళ్లు.

ఈ ఇన్ష్యూరెన్స్ మెచ్యూరిటీ వయస్సు 25 సంవ‌త్స‌రాలు. అంటే పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పాలసీ గడువు ఉంటుంది.

ప్రీమియం చెల్లింపు ఏడాది. ఆరు నెలలకోసారి, మూడు నెలలకోసారి, నెలకోసారి ప్రీమియం చెల్లించాల్సివుంటుంది.

ఇన్ష్యూరెన్స్ మొత్తం కనీసం రూ.1,00,000. గరిష్ట పరిమితి లేదు.

లాభాల‌ను ఒక‌సారి చూసిన‌ట్ల‌యితే.. ఈ పాలసీ తీసుకున్న పిల్లలకు వారి వయస్సు 18, 20, 22 ఏళ్లు ఉన్నప్పుడు 20 శాతం చొప్పున మనీ బ్యాక్ వస్తుంది.

మూడు వాయిదాల్లో 20 శాతం చొప్పున 60 శాతం మనీ బ్యాక్ ఇస్తారు కాబట్టి మిగతా 40 శాతం డ‌బ్బు మెచ్యూరిటీ తర్వాత బోనస్‌తో కలిపి వస్తుంది.

అనుకోని పరిస్థితుల్లో పాలసీహోల్డర్ మరణిస్తే ఇన్ష్యూరెన్స్ మొత్తంతో పాటు బోనస్ కూడా ఇస్తామ‌ని ఎల్ఐసీ చెబుతోంది.

ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీకి ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది.

పాలసీ తీసుకున్న తర్వాత నచ్చకపోతే 15 రోజుల్లో వెనక్కి ఇచ్చి ప్రీమియం తీసుకోవచ్చు.

ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంది.

ప్రీమియం పేమెంట్ ఆలస్యమైతే 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

ఈ పాలసీకి రైడర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత సరెండర్ చేయొచ్చు.

ఎల్ఐసీ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ తీసుకుంటే పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రీమియం చెల్లిస్తున్న కాలంలో మరణిస్తే ఆ తర్వాత చెల్లించాల్సిన ప్రీమియంలను మాఫీ చేస్తారు.

అంటే ప్రీమియంలు చెల్లించకపోయినా పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చేవరకు పాలసీ కొనసాగుతుంది.

ఏదిఏమైనా పాల‌సీ తీసుకునే ముందు నియ‌మ నిబంధ‌న‌లు పూర్తిగా చ‌ద‌వ‌డం మాత్రం మ‌ర్చిపోవ‌ద్దు.