సముద్రం అడుగున పురుషాంగం

314

స‌ముద్రం ఓ నీటి ప్ర‌పంచం. ఇందులో ఎన్నో ర‌కాల జీవ‌రాసులు ఉంటాయి. స‌ముంద్రంలో స‌ర్ఫింగ్‌, డైవింగ్ చేయడానికి చాలామంది ఇష్టపడతారు.

కొందరు సముద్ర తీరంలో డైవింగ్ చేస్తే.. మరికొందరు సముద్రం మధ్యలోకి వెళ్లి అసలైన మజాను ఆస్వాదిస్తారు.

ఆస్ట్రేలియాకు చెందిన 48 ఏళ్ల జోసీ జోన్స్‌ అనే మహిళకు కూడా డైవింగ్ అంటే చాలా ఇష్టం. అయితే ఆమె డైవింగ్ చేయడం వెనుక మంచి ఉద్దేశం ఉంది.

మనుషులు వదిలే చెత్త వల్ల సముద్ర జీవాల‌కు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతో ఆమె ఈ పని చేస్తుంటుంది. నిత్యం డైవింగ్ చేస్తూ చెత్తను తొలగిస్తోంది.

ఎప్పటిలాగానే ఓ రోజు సముద్రంలోకి డైవింగ్‌కు వెళ్లిన జోసీ పురుషాంగాన్ని చూసి షాకైంది. తెల్ల రంగులో ఉన్న ఆ పురుషాంగం దానికదే కదలడం చూసి ఆశ్చర్యపోయింది.

వామ్మో అనుకుంటూ దగ్గరకు వెళ్లి చూడగా.. అది ‘పెనీస్ ఫిష్’. అవును! పురుషాంగం రూపంలో చేపలు కూడా ఉంటాయి.

ఎక్కువగా సముద్రం అడుగున నివసించే ఆ చేపలను ‘పెనీస్ ఫిష్’ అని అంటారు. ‘పదేళ్ల నుంచి నేను విక్టోరియా బీచ్‌లోని సముద్రాన్ని క్లీన్ చేస్తున్నాను.

డైవింగ్ చేస్తూ సముద్రం అడుగుకు వెళ్తుంటాను. అక్కడ సీగ్రాస్, సీబెడ్స్, చెత్తను క్లీన్ చేయడం ద్వారా సముద్ర జలాలు కలుషితం కాకుండా చూస్తుంటాను.

అప్పుడు నాకు కనిపించే అరుదైన చేపలు, జీవుల ఫొటోలు తీస్తుంటాను. అటువంటి సమయంలోనే నాకు ఆ పెనీష్ ఫిష్ లేదా పెనీస్ వార్మ్ (పురుగు) కనిపించింది.

దాన్ని సీ-కుకుంబర్ అని కూడా అంటారు. పెనీస్ ఫిష్‌ను చూడగానే భలే క్రేజీగా అనిపించింది. అందుకే, ఆ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశా’ అని ఆమె తెలిపింది.