దళితులంతా ఏకం కావాలి: బండి సంజయ్

260
KU OU destroyed by KCR: Bandi Sanjay

దళితులంతా ఏకమై ప్రభుత్వ అన్యాయాలపై పోరాడాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.

సంత్ శిరోమణి రవిదాస్ మహరాజ్ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

అంబేద్కర్, రవిదాస్ మహరాజ్ జయంతి కార్యక్రమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.

పేదల జయంతి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ కు గుర్తుండవని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షకులు దళితులేనని అన్నారు.

ఈ సమాజాన్ని చీల్చేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్ నగరంలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు.