మంచి అబ్బాయిని చూస్తే పెళ్లి చేసుకుంటా..

779

దబాంగ్, రౌడీ రాథోడ్, ఓ మై గాడ్, దబాంగ్ 2, లింగాతోపాటు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా. బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా ముద్దుల కూతురైన సోనాక్షికి పెళ్లివైపు మనసు మళ్లినట్లుంది. ఇటీవలే తన పెళ్లి గురించి మనసులో మాట చెప్పింది.

ఓ ఛానల్‌లో ప్రసారమయ్యే సూపర్‌డ్యాన్సర్ 3 షోకు కళంక్ సినిమా ప్రచారంలో భాగంగా సోనాక్షిసిన్హా, వరుణ్‌ధవన్, అలియాభట్ ముఖ్యఅతిథులుగా వచ్చారు. జహీర్ ఇక్బాల్ అనే యాక్టర్‌తో సోనాక్షి డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న శిల్పాశెట్టి..డేటింగ్ విషయంపై సోనాక్షిని అడగ్గా.. అలాంటిదేమి లేదని, తాను ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నానని సోనాక్షి చెప్పింది. మీ ముగ్గురిలో ఎవరు ముందు పెళ్లి చేసుకోబోతున్నరని ప్రశ్నించగా..తానే అంటూ సమాధానమిచ్చి సోనాక్షిసిన్హా. అంతేకాదు తన కోసం ఓ మంచి అబ్బాయిని వెతికిపెట్టాలని కోరింది. సరైన అబ్బాయి దొరికితే వెంటనే పెళ్లి చేసుకునేందుకు రెడీ అని చెప్పేసింది సోనాక్షి. దీంతో ఈ ఏడాది పెళ్లి పీటలెక్కబోయే హీరోయిన్ల జాబితాలో సోనాక్షి కూడా చేరే అవకశాముందంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.