పెళ్లికాని ప్రసాదుల గురించి…

278

చాలా మంది యువ‌తీ యువ‌కులు పెళ్లికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. జీవితంలో స్థిర‌ప‌డ్డాక పెళ్లి చేసుకుందామ‌ని ఆలోచిస్తున్నారు.

కానీ వయసు 30 దాటినా ముదురు బెండకాయలా మారిపోతున్నాని తెగ ఆవేదన చెందుతూ ఉన్నారు.

జీవితంలో సెటిల్ అవ్వాలనే ఆలోచ‌న‌తో పెళ్లి అనే ముఖ్యమైన ఘట్టం గురించి మరిచిపోతున్నారు.

తమ వయసు మూడు పదులు దాటినా కొత్త వ్యక్తితో కలిసి జీవితాన్ని పంచుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

పెద్దలు మాత్రం ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని చెబుతుంటారు. కానీ నేటి త‌రం వాళ్లు ఈ మాటలను అస్సలు పట్టించుకోవట్లేదు.

వారి మాటలు లెక్క చేయకపోవడంతో మూడు పదుల వయసు దాటినా పెళ్లి కాని ప్రసాదులుగానే మిగిలిపోతున్నారు.

మరి ఇలాంటి వారి గురించి సమాజం ఏమనుకుంటోంది వీరిని లోకం ఎలా ఆడిపోసుకుంటుందో తెలుసుకుందాం.

ప్రస్తుత సమాజంలో ఆడవారైనా మగవారైనా మూడు పదుల వయసు దాటేలోపు సెటిల్ అవ్వాలని పెద్దలు చెబుతుంటారు.

అలా గనుక జరగకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందట. అవి సహజమైనవి కావచ్చు. లేదా ఇతర సమస్యలు కూడా కావొచ్చు.

ఇదిలావుంటే మూడు పదుల వయసు దాటిన వారి గురించి జనాలు ఏమనుకుంటున్నారు అనే విషయంపై ఓ ప్రైవేట్ సంస్థ సర్వే చేసింది. అందులో షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి.

ముప్పై ఏళ్లు వ‌చ్చినా పెళ్లి కాక‌పోవ‌డంతో ఈ లోకం వారిని బాధ్యత లేని వారిగా పరిగణిస్తుందట. అతను ఇంకా మెచ్యూర్ కాలేదని అనుకుంటారట.

అంతేకాదు పెళ్లి కాకుండా ఎవరైనా అమ్మాయిని మామూలుగా చూసినా వారి గురించి తప్పుగా అర్థం చేసుకుంటార‌ట‌. వారి గురించి ఏవేవో గుసగుసలాడుకుంటారట.

సింగిల్‌గా ఉండే సమయంలో పార్టీలకు, పబ్బులకు లేదా ఇత కార్యక్రమాలకు ఉన్న డబ్బంతా ఖర్చు చేసివుంటార‌ని అనుకుంటార‌ట‌.

అందుకే పెళ్లికి ఇప్పుడు కావాల్సినంత డబ్బు లేక ఒంటరిగా మిగిలిపోయారని భావిస్తార‌న‌. అందుకే వీళ్లు ఇత‌రుల‌తో కలవడానికి ఇష్టపడరని గుస‌గుస‌లాడ‌తార‌ట‌.

బ్రహ్మచారులుగా ఉండే వారికి కొన్ని విచిత్రమైన విషయాలు నచ్చుతాయట. అందులో ఒకటి కొందరికి అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువగా నచ్చుతారట.

అందుకే వీళ్ల‌కు పెళ్లి కావడం లేదని భావిస్తారట. దీంతో వీళ్లు ‘గే’ అని లేదా ఏదైనా లోపం ఉండొచ్చు అన్న అనుమానం వ్యక్తం చేస్తారట.

మూడు పదుల వయసు దాటిన తర్వాత కూడా పెళ్లి చేసుకోకపోతే ఎవరితో అయినా సీక్రెట్ లవ్‌లో ఉన్నారేమో అన్న అనుమానం క‌లుగుతుంద‌ట‌.

ఏదైనా కంపెనీ లేదా ఆఫీసులో పని చేసే చోట ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నారని లేదా సరైన అమ్మాయి దొరకడం లేదని భావిస్తూ ఉంటారట.