ఊబెర్ ట్యాక్సీలో ఉచిత ప్రయాణం

248

కోవిడ్ 19 వ్యాక్సినేష‌న్ స‌మ‌యంలో ప్ర‌ముఖ ట్రావెల్స్ సంస్థ ఉబెర్ ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.

మీ ఇంటి నుంచి వ్యాక్సినేషన్ సెంటర్‌కు ఊబెర్ ట్యాక్సీలో ఉచితంగా వెళ్లొచ్చు. అంతేకాదు వ్యాక్సిన్ తీసుకున్నాక ఉచితంగానే ఊబెర్ ట్యాక్సీలో ఇంటికి రావ‌చ్చు.

ఇదే ఊబెర్ ప్రకటించిన ఆఫర్. ప్రస్తుతం భారతదేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ రెండో దశ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇందుకోసం ఊబెర్ రూ.10 కోట్ల విలువైన ఫ్రీ రైడ్స్ ప్రకటించింది. వ్యాక్సిన్ సెంటర్‌కు వెళ్లే 60 ఏళ్ల పైబడ్డ వృద్ధులకు, 45 ఏళ్లు పైబడ్డ రోగులకు ఊబెర్ ప్రకటించిన ఈ ఆఫర్ ఎంతో ఉపయోగపడనుంది.

ఇందుకోసం ప్రోమో కోడ్ ఉపయోగిస్తే చాలు. ఉచితంగా వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి తిరిగి ఇంటికి రావొచ్చు.

వృద్ధులను వ్యాక్సినేషన్ సెంటర్‌కు తీసుకొచ్చేందుకు ఊబెర్ రాబిన్‌హుడ్ ఆర్మీ లాంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసిపనిచేస్తోంది.

దేశవ్యాప్తంగా మార్చి 8 నుంచి 35 నగరాల్లో ఉచిత రైడ్స్ అందించనుంది. గరిష్టంగా రూ.150 విలువైన ఫ్రీ రైడ్ పొందొచ్చు.

అంతకన్నా ఎక్కువ ఫేర్ అయితే మిగతాది చెల్లించాల్సి ఉంటుంది. ఒకరు గరిష్టంగా రెండుసార్లు ఈ రైడ్ పొందొచ్చు.

మరి ఊబెర్‌లో ఫ్రీ రైడ్ ఎలా క్లెయిమ్ చేయాలో ముందుగా తెలుసుకోండి.