ఎన్టీఆర్ కు విలన్ గా విజయ్ సేతుపతి ?

342
Vijay Sethupathi to turn villain for Jr NTR

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు విలన్‌గా తమిళ స్టార్ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని త్రివిక్రమ్ సంప్రదిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట.

అయితే త్రివిక్రమ్‌కు విజయ్ సేతుపతి ఓకే చెప్తారో లేదో చూడాలి.

ఎన్టీఆర్ 30వ చిత్రంగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

‘అరవింద సమేత’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.

ఇంచుమించుగా ‘అరవింద సమేత’కు పనిచేసిన టెక్నికల్ టీమే ఈ చిత్రానికి పనిచేస్తుంది.

ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్. ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాక్రిష్ణ (చినబాబు), కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా ఇంతవరకు తమిళ అనువాద చిత్రాల ద్వారా తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న విజయ్ సేతుపతి.. ‘ఉప్పెన’తో డైరెక్ట్ తెలుగు సినిమా చేసి ఇండస్ట్రీలో టాక్ అఫ్ ది టౌన్ అయ్యారు.

దీంతో తెలుగు నిర్మాతలు, దర్శకుల కన్ను ఆయనపై పడింది. విజయ్ సేతుపతి తమిళంలో ఒకవైపు హీరోగా నటిస్తూనే నెగిటివ్ రోల్స్ కూడా చేస్తున్నారు.