బాలీవుడ్ బ్యూటీలు కంగనా రనౌత్, తాప్సి మధ్య మరోసారి మాటల యుద్ధం రాజుకుంటోంది. రైతుల ఉద్యమంపై ఇంటర్నేషనల్ పాప్ సింగర్ రెహాన్నే చేసిన ట్వీట్స్ దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో రెహాన్నే కు ట్విట్టర్ వేదికగా కంగనా కౌంటర్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే కంగనా, తాప్సి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. కంగనాను ఉద్దేశిస్తూ తాప్సి “మీ విలువలను, వ్యవస్థను బలపరిచేందుకు మీ పని మీరు చెయ్యాలి తప్ప ఇతరులకు పాఠాలు నేర్పే టీచర్‌గా మారొద్దు” అంటూ పరోక్షంగా సలహా ఇచ్చింది.
If one tweet rattles your unity, one joke rattles your faith or one show rattles your religious belief then it’s you who has to work on strengthening your value system not become ‘propaganda teacher’ for others.
— taapsee pannu (@taapsee) February 4, 2021
తాప్సి ట్వీట్ కు ఫైర్ బ్రాండ్ కంగనా “బీ గ్రేడ్ మనుషులకు బీ గ్రేడ్ ఆలోచనలే వస్తాయి. వారి ఉచిత సలహాలను వినకండి. వాటి వల్ల దేశానికి ఏమాత్రం ఉపయోగం ఉండదు. అందుకే నేను వారిని బి గ్రేడ్ అని పిలుస్తాను” అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు వీరిద్దరి ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ ‘తాప్సి, కంగనా వ్యాఖ్యలు ఇంత వివాదాస్పదంగా, విషపూరితంగా లేకుండా ఉంటే బాగుండు’ అని ట్వీట్ చేశాడు.
ఆ నెటిజన్ కు తాప్సి బదులిస్తూ “విషం వారి డీఎన్ఏలోనే ఉండొచ్చు. ఆర్ఎన్ఏ, ప్లేట్‌లెట్స్‌పై కూడా..” అని కామెంట్ చేసింది. దీనిపై కంగనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.