నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (ఏప్రిల్ 26)

301
today events in hyderabad
today programs in Hyderabad

పుస్తకాల ఆవిష్కరణ
కార్యక్రమం: రఘుశ్రీ రచించిన ‘రత్నదీపాలు’ (నానీలు) కవితా సంపుటి ఆవిష్కరణ.
కార్యక్రమంలో భాగంగా కూచిపూడి నాట్య గురువు వేదాంతం సత్యనృసింహశాస్త్రి శిష్యురాలు
సాయి అరుణాంజలిచే కూచిపూడి నృత్యప్రదర్శన
స్థలం: కళా లలిత కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 5.30

ఆవిష్కరణ సభ
కార్యక్రమం: ‘తోలుబొమ్మలాట’ కథాసంపుటి (రచయిత: కూనపరాజు కుమార్‌),
‘మిత్రుడొచ్చిన వేళ’ కవితాసంపుటి (కవి, డాక్టర్‌ ప్రసాదమూర్తి) ఆవిష్కరణ సభ
స్థలం: ప్రెస్‌క్లబ్‌, సోమాజిగూడ
సమయం: సా. 6

తెలంగాణ నృత్యవైభవం
కార్యక్రమం: వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ సహకారంతో, స్వరమాధురి సేవా సంస్థ ఆధ్వర్యంలో…
జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా కూచిపూడి, భరతనాట్యం జానపదుల తెలంగాణ
కళాకారులచే నృత్య ప్రదర్శనలు, అంజి తాడూరి నిర్వహణలో ‘సినీ సంగీత విభావరి’
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 4 – 9

నవ్య నాటకోత్సవాలు
కార్యక్రమం: తెలంగాణ థియేటర్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వహణలో ‘నవ్య నాటకోత్సవాలు’.
అన్నపూర్ణ సంస్థ ఆధ్వర్యంలో అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా
సమర్పణలో.. ‘రావణాయణ’ నాటకం (దర్శకుడు: డాక్టర్‌ విజయరాఘవ తాటిపర్తి), యువ
దర్శకుడు అంజిబాబు రచించిన ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ నాటక ప్రదర్శన
స్థలం: రవీంద్రభారతి
సమయం: సా. 6.30

సదస్సు
కార్యక్రమం: ‘వలసలపై ప్రపంచ సంఘటిత ఒప్పందం గురించి దక్షిణ భారత స్థాయి
సదస్సు
స్థలం: జీవన్‌జ్యోతి, చీకోటి గార్డెన్స్‌, బేగంపేట్‌,
సమయం: ఉ. 10 – 4.30

‘అంకెల గారడీ’పై ప్రసంగం
కార్యక్రమం: వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో… ‘పద్యాలలో అంకెల గారడీ’
అంశంపై ద్వానా శాస్త్రి ప్రసంగం
స్థలం: కళా సుబ్బారావు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 5.30

ఈ-వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రసంగం
కార్యక్రమం: ‘ఎ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎనేబ్లింగ్‌ సర్క్యులర్‌ ఎకానమీ ఇన్‌ ఈ-వేస్ట్‌
మేనేజ్‌మెంట్‌ సెక్టార్‌’ అంశంపై డాక్టర్‌ షాలినీ శర్మ ప్రసంగం
స్థలం: గోతెజెంత్రం, రోడ్‌ నెం. 3, బంజారాహిల్స్‌
సమయం: సా. 6.30