హెచ్‌సీయూలో పలు కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

430
Invitation for admissions to various courses in HCU

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో 2018-19 విద్యా సంవత్సరానికి వర్సిటీలో అందిస్తున్న 115 కోర్సుల్లో ప్రవేశానికి ఆర్హులైన, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 ఇంటిగ్రేటెడ్‌, 42 పీజీ, 12 ఎంఫిల్‌, 6 ఎంటెక్‌, 40 పీహెచ్‌డీ ప్రోగామ్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 5 నుంచి మే 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నూతనంగా ప్రవేశపెట్టిన కోర్సులు: ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ, పీహెచ్‌డీ, ఇన్‌ బయోకెమిస్ట్రీ, మాలిక్యూలర్‌ బయోలాజి, పీహెచ్‌డీ నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎంఏ ఎడ్యుకేషన్‌, పీహెచ్‌డీ ఎడ్యుకేషన్‌, పీహెచ్‌డీ ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, పీజీ డిప్లొమా ఇన్‌ సాంస్కృత్‌ కాంపిటిషనల్‌ లిగ్విస్టిక్స్‌ కోర్సులు అందు బాటులో ఉన్నట్లు తెలిపారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని తెలిపారు.