ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ తాజాగా నటిస్తున్న చిత్రం “కిన్నెరసాని”.
ఈ సినిమాకు రమణ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్ రమణ తేజ్ ఇంతకుముందు “అశ్వథ్థామ” చిత్రానికి దర్శకత్వం వహించారు.
సాయి రిషిక సమర్పణలో రామ్ తళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహతి సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈరోజు కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు సందర్బంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రం నుంచి “థీమ్ ఆఫ్ కిన్నెరసాని” అనే వీడియోను విడుదల చేశారు. ఎమోషనల్ గా సాగిన ఈ థీమ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.
అయితే ఈ వీడియో చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా అన్పిస్తుంది. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.
కాగా కళ్యాణ్ దేవ్ “విజేత” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంతో పర్వాలేదన్పించిన కళ్యాణ్ ఆ తరువాత “సూపర్ మచ్చి” చిత్రంలో నటించారు.
ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించారు. అయితే ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు.
ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ నటిస్తున్న “కిన్నెరసాని” చిత్రం ఆయనకు మూడవ చిత్రం.