‘తెలంగాణ నయాగరా’.. బొగత జలపాతం

403

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో..ప్రకృతి అందాలకు తలమానికంగా మారిన ఈ జలపాతం పరవళ్లు తొక్కుతోంది.‘గంగ కురులు విప్పి పరవళ్లు తొక్కితే అదే… జలపాతం!’ ఈ మాట బొగత జలపాతానికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది.  ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన వర్షాలకు అటవీ ప్రాంతంలోని నీరంతా వచ్చి ఈ జలపాతంలో చేరడంతో క్రొత్త కళ ను సంతరించుకుంది. వేసవిలో నీరు లేకపోవడంతో వెలవెల బోయిన నీటి ధారలు..ఇప్పుడు కొత్త నీరు చేరడంతో ప్రవాహంగా మారి అలరిస్తున్నాయి. ‘తెలంగాణ నయాగరా’గా పేరుతెచ్చుకున్న ఈ జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటోంది.