హ్యుండయ్‌ ఇండియా‘కోన-ఈవీ’ఒక్కసారి ఛార్జింగ్‌… 400 కిలోమీటర్లు

265
first complete electrical car

కాలుష్య రహితం… పర్యావరణ హితం… రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా అనేది నిపుణుల మాట. అందుకే ఇప్పటి నుంచే ఆ మార్కెట్‌ను చేజిక్కించు కొనేందుకు వాహన తయారీ కంపెనీలన్నీ పోటీపడుతు న్నాయి. కొత్త కొత్త మోడల్స్‌ను మెరుగైన సామర్థ్యంతో తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే హ్యుండయ్‌ ఇండియా తమ తొలి ఎలక్ట్రిక్ కారు… ‘కోన-ఈవీ’ని రోడ్డెక్కించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల రెండో వారంలో ఆవిష్కరించనున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 400కి.మీ. ప్రయాణిస్తుంది. భారత్‌లో తయారవుతున్న తొలి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇది. ఇప్పటి వరకు భారత్‌ మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే గరిష్ఠంగా 150 కి.మీ. మాత్రమే ప్రయాణించగలవు.

ఆకర్షణలు ఎన్నో….

హ్యుండయ్‌ ‘కోన’లో 134 బీహెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్‌ ఉంటుంది.

ఇందులో 39.2 కిలోవాట్‌ బ్యాటరీ అమర్చారు.

10 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

కారు టాప్‌ స్పీడ్‌ గంటకు 160 కిలోమీటర్లు.

ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ గల దీని ధర రూ.25 లక్షల రేంజ్‌లో ఉండవచ్చని అంచనా.