‘మహర్షి’ నుంచి ఫస్టు సింగిల్ వచ్చేస్తోంది

295

మహేశ్ బాబు 25వ సినిమాగా ‘మహర్షి’ రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అల్లరి నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

తమ అభిమాన హీరో మహేశ్ కోసం దేవిశ్రీ ఎలాంటి బాణీలను కట్టాడా అనే విషయంపై అభిమానులంతా దృష్టిపెట్టారు. ఈ సినిమా నుంచి సాంగ్స్ ను ఎప్పుడు వదులుతారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫస్టు సింగిల్ ను వదలడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీన ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అశ్వనీదత్ .. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాను, మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.