తెలంగాణా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు 1058

398
Telangana postal circle recruitment 2018

-పదోతరగతి ఉత్తీర్ణులకు అవకాశం
-పోస్టల్ శాఖ పరిధిలో కొలువు
-అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక
-చివరితేదీ ఏప్రిల్ 9

వివరాలు

పోస్టు: గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్ బీపీఎం, జీడీఎస్ ఎంసీ)
జీడీఎస్ బీపీఎం పేస్కేల్: రూ. 2745 – 50 – 4245
జీడీఎస్ ఎంసీ పేస్కేల్: రూ. 2295 – 50 – 4245/3695
జీడీఎస్ ఎండీ పేస్కేల్: రూ. 2295 – 45 – 4165
జీడీఎస్ ప్యాకర్ పేస్కేల్: రూ. 3635 – 65 – 5585

నోట్: పేస్కేల్స్‌లో ఆయా ఏరియాలను బట్టి మార్పులు ఉన్నాయి. వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య – 1058. వీటిలో జనరల్ – 559, ఓబీసీ – 247, పీహెచ్ -హెచ్‌హెచ్ – 14, పీహెచ్‌సీ – ఓహెచ్ – 15, ఎస్సీ – 133, ఎస్టీ – 76 ఉన్నాయి.
ఈ పోస్టులన్నీ రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలో ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
వయస్సు: 2018, మార్చి 9 నాటికి 18 – 40 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.



విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి పదోతరగతి ఉత్తీర్ణత. అదనపు అర్హతలను పరిగణలోకి తీసుకోరు. పదోతరగతి పరీక్షలను సప్లమెంటరీలో (రెండో ప్రయత్నంలో) పాసైన వారి కంటే మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులైనవారికి ప్రాధాన్యం ఇస్తారు.

కంప్యూటర్ నాలెడ్జ్: గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 60 రోజులపాటు కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై శిక్షణ తీసుకొన్న సర్టిఫికెట్ ఉండాలి లేదా ఇంటర్ లేదా ఉన్నత చదువుల్లో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నవారికి ప్రత్యేక సర్టిఫికెట్ అవసరం లేదు.
నివాసం: జీడీఎస్ – బీపీఎం తప్పనిసరిగా ఎంపికైన బ్రాంచి పోస్ట్ ఆఫీస్ ఉన్న గ్రామంలో నివాసం ఉండాలి.



ఎంపిక విధానం: పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు సమయంలో పదోతరగతి సర్టిఫికెట్, కంప్యూటర్ సర్టిఫికెట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, పీహెచ్‌సీ సర్టిఫికెట్ (ఉన్నవారు), ఫొటో, సంతకాన్ని ఆన్‌లైన్‌లో జేపీజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 9
ఫీజు: ఓసీ/ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ. 100/-
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

వివరాల కోసం Help Desk number for Telangana Circle : 040-23463613. All queries of candidates may be mailed to gdstlg2017@gmail.com,dopgdsenquiry@gmail.com
వెబ్‌సైట్: https://indiapost.gov.in or http://appost.in/gdsonline
నోట్: నెలలోగా నివాసం ఉంటామని డిక్లరేషన్ ఇవ్వాలి.ఎంపికైన అభ్యర్థులు సెక్యూరిటీ బాండ్ కింద రూ, 25వేలు/10 వేలు బాండ్‌ను సమర్పించాలి.