త్వరలో 6000 పోస్టులతో తెలంగాణా గ్రూప్-4 నోటిఫికేషన్

765
telangana-group-4-notification-soon

రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల నోటిఫికేషన్ సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని టిఎస్‌పిఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి. సుమారుగా 4 నుంచి 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో దాదాపు 3వేల వరకు గ్రామపంచాయితీ అధికారుల పోస్టులు(పంచాయితీ సెక్రటరీ) ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పంచాయితీరాజ్ డిపార్ట్ నుంచి పోస్టుల భర్తీ అనుమతి కోసం ఆర్ధికశాఖకు ఇంకా ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని సమాచారం. ఇటీవల కొత్తగా గ్రామ పంచాయితీలు ఏర్పాటు చేయడంతో ఖాళీల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ పోస్టుల భర్తీకి ఆర్ధికశాఖ అనుమతి జారీచేస్తే సుమారుగా 6వేల ఉద్యోగాలతో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.వీఆర్వో పోస్టులకు వేరే నోటిఫికేషన్?

రెవెన్యూ శాఖలో 700 గ్రామరెవెన్యూ అధికారుల(VRO) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సంబంధిత విభాగాల అధిపతుల నుంచి ఇటీవలే టిఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అయితే వీటిని గ్రూప్-4 నోటిఫికేషన్‌తో కలిపి విడుదల చేయాలా లేక విడిగా నోటిఫికేషన్ జారీ చేయాలా అని TSPSC ఆలోచిస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు సర్వీస్ కమిషన్ సభ్యులు భావిస్తున్నారు.