బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు ఎయిమ్స్‌లో 1343 ఉద్యోగాలు

276
Staff Nurse Recruitment in AIIMS Rishikesh

బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు సదవకాశం
రాతపరీక్ష/ఇంటర్వూ ద్వారా ఎంపిక
మంచి జీతభత్యాలు, ఉద్యోగ భద్రత
దరఖాస్తులకు చివరితేదీ: 2018 మార్చి 12

ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఖాళీగా ఉన్న స్టాఫ్‌నర్స్ (గ్రేడ్ -2 ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.



వివరాలు

ఎయిమ్స్ రిషికేష్ దేశంలోని ఏడు అత్యున్నత ఆరోగ్య ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఒకటి. దీన్ని 2012 సెప్టెంబర్ 20న స్థాపించారు.
-మొత్తం పోస్టుల సంఖ్య- 1126 పోస్టులు (జనరల్-570, ఓబీసీ-304, ఎస్సీ-168, ఎస్టీ-84)
-పోస్టు పేరు: స్టాఫ్‌నర్స్ (గ్రేడ్ -2)
-అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేండ్ల బీఎస్సీ ఆనర్స్/నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్టు సర్టిఫికెట్), బీఎస్సీ నర్సింగ్ (పోస్టు బేసిక్) లేదా జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీలో డిప్లొమాలో ఉత్తీర్ణత. 50 పడకల హాస్పిటల్/హెల్త్‌కేర్ హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్స్‌గా రెండేండ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. నర్స్ అండ్ మిడ్‌వైఫరీలో సెంట్రల్/స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి.
-పే స్కేల్: రూ. 9,300-34,800 + గ్రేడ్ పే రూ. 4,600/-
-వయస్సు: 21 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


-ప్రొబేషనరీ పీరియడ్ : రెండేండ్లు
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ రాతపరీక్ష
-అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3000/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. పూర్తి వివరాలతోపాటు, వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. నిర్ణీత ఫార్మాట్‌లోనే ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 12