శర్వానంద్‌కు గాయాలు…11 గంటలపాటు శస్త్రచికిత్స

200
injury

షూటింగ్‌లో గాయపడ్డ యువ కథానాయకుడు శర్వానంద్‌కు శస్త్ర చికిత్స పూర్తయింది. 11 గంటలపాటు శ్రమించి వైద్యులు ఆయన భుజానికి చికిత్స చేశారు. రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో శర్వానంద్‌ మరో రెండు నెలల పాటు షూటింగ్‌కు దూరంగా ఉండబోతున్నారు.

‘96’ సినిమా షూటింగ్‌ సమయంలో శర్వానంద్‌ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్కై డైవింగ్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలున్నాయి. దాని కోసం థాయ్‌లాండ్‌లో తర్ఫీదు పొందుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ శర్వా గాయడ్డారు. సరైన దిశలో ల్యాండ్‌ అవ్వని కారణంగా శర్వా భుజానికి, కాలికి గాయమైంది. వెంటనే ఆయన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. సోమవారం శస్త్ర చికిత్స చేశారు.

తమిళంలో వచ్చిన ‘96’మూవీని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. ఇందులో హీరో హీరోయిన్లుగా శర్వానంద్, సమంతలు నటిస్తున్నారు. తమిళ్‌లో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్ ‘96’లో విజయ్ సేతుపతి, త్రిష నటించారు. తమిళ్‌లో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

అయితే టాలీవుడ్ హీరోలు వరుసగా హీరోలు గాయాలపాలవుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ షూటింగ్ చేస్తూ గాయపడగా.. రెండు రోజుల క్రితం యంగ్ హీరో నాగశౌర్య కూడా షూటింగ్‌లో డూప్ చేస్తూ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇప్పుడు శర్వానంద్ కూడా షూటింగ్ సమయంలోనే ప్రమాదానికి గురవ్వడంతో టాలీవుడ్‌లో ఇదే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.