లవ్ స్టోరీ : ‘సారంగ దరియా’ ఫోక్ సాంగ్ టీజర్

349
Saranga Dariya being released by Samantha on 28th Feb

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘లవ్ స్టోరీ’.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

‘లవ్ స్టోరి’ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమాలోని ‘సారంగ దరియా’ సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

గతంలో తెలంగాణలో ఓ సింగర్ పాడిన ‘దాని కుడీ భుజం మీద కడువా.. ‘ అనే ఫోక్ సాంగ్‌ను ఈ ‘లవ్ స్టోరీ’ సినిమాలో రీమిక్స్ చేశారు.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సాంగ్‌కి తగ్గట్టుగా పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే లొకేషన్స్ ఎంచుకొని షూట్ చేయగా… సాయి పల్లవి ఇందులో చిందేసింది.

మంగ్లీ పాడిన ఈ పాట ఫుల్ వీడియో ఫిబ్రవరి 28వ తేదీన స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత చేతుల మీదుగా విడుదల కానుంది.