15 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న సమంత

173
Samantha hits 15 Million on Instagram

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మరో అరుదైన రికార్డును సాధించింది. 33 ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో మరో మైలురాయిని చేరుకుంది. తాజాగా సామ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో 15 మిలియన్ల మంది ఫాలోవర్స్ మార్కును దాటింది. ఈ విషయాన్ని సమంత తన ఇంస్టాగ్రామ్ లో వీడియోను షేర్ చేస్తూ తెలిపారు.

“ఇప్పుడే షూటింగ్ ఫినిష్ చేశాను. నాకో సర్‌ప్రైజ్ వచ్చినట్టు తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ ఫాలోవర్స్. లైక్‌లు, కామెంట్లతో నన్ను ఎంతో ప్రోత్సహించిన నా ఇన్‌స్టాగ్రామ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. మరింత ఉన్నతంగా పని చేయాలనే స్ఫూర్తిని కలిగించారు. లవ్యూ ఆల్” అంటూ సమంత పేర్కొంది.

ఇక సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సౌత్ స్టార్స్ లో సమంత కూడా ఒకరు. ఆమె సోషల్ మీడియా ద్వారా తన జీవితంలోని ప్రతి ప్రత్యేక క్షణాన్ని అభిమానులతో పంచుకుంటారు. వర్కౌట్ సెషన్లు, ఫోటోషూట్లు, సామ్ కు ఇష్టమైన తన పెంపుడు కుక్క, భర్త నాగ చైతన్య, తన సినిమాలకు సంబంధించిన విషయాలు అన్నీ సోషల్ మీడియా ద్వారానే అభిమానులతో పంచుకుంటారు సామ్.

కాగా సామ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (సీజన్ 2)తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు విజయ్ సేతుపతి, నయనతారతో కలిసితమిళ చిత్రం ‘కాతు వాకులా రేండు కాదల్’ చిత్రంలో నటిస్తోంది సమంత. అంతేకాదు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘శకుంతలం’లో కూడా సమంత ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఇక సామ్ సినిమాలు, యాడ్లతో బిజీగా ఉన్నప్పటికీ 2020లో ప్రీ-స్కూల్ వ్యాపారం, అమ్మాయిల ఫ్యాషన్ దుస్తుల వ్యాపారాల్లోకి అడుగు పెట్టి వ్యాపారవేత్తగా మారింది. నాగ చైతన్యతో వివాహం తరువాత కూడా సామ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.