కత్రినా నన్ను వదిలేసింది – సల్మాన్‌ ఖాన్‌

329
movie promotions

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నాలుగు చిత్రాల్లో నటించారు. వీరిద్దరి జంటకు అభిమానుల్లో క్రేజ్‌ ఎక్కువే. అదీకాకుండా ఇద్దరూ ఒకప్పుడు ప్రేమించుకున్నారని టాక్‌. ప్రస్తుతం వీరు జంటగా ‘భారత్’ చిత్రంలో నటించారు.

ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ కామెడీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కత్రినా ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? అన్న విషయంపై చర్చ జరిగింది. 2009లో ‘దే దనా దన్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో కత్రినా స్మూతీలు తినడం మానేశారట.

ఈ విషయాన్ని కత్రినా ఫిట్‌నెస్‌ ట్రైలర్‌ అర్చనా పురాన్‌ సింగ్‌ వెల్లడించారు. అవి తినడం మానేశాక ఇంకా ఫిట్‌గా తయారయ్యారని అన్నారు. ఈ మాట వినగానే పక్కనే ఉన్న సల్మాన్‌.. ‘ఆ సినిమా సమయంలో కత్రినా స్మూతీలనే కాదు నన్ను కూడా వదిలేసింది’ అన్నారు.

దాంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. ‘దే దనా దన్‌’ సినిమా విడుదలైన ఏడాదిలోనే కత్రినా.. రణ్‌బీర్‌ కపూర్‌తో ‘అజబ్ ప్రేమ్‌ కీ గజబ్‌ కహానీ’ సినిమాలో నటించారు. ఆ సమయంలోనే కత్రినా, రణ్‌బీర్‌ ప్రేమించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అందుకే సల్మాన్‌ పై విధంగా స్పందించారు.

అయితే సల్మాన్‌ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని షోలో ఉన్న ఓ వ్యక్తి కత్రినాను ప్రశ్నించగా.. ‘ఆ విషయం సల్మాన్‌కు, దేవుడికి మాత్రమే తెలుసు’ అని చెప్పి మాటదాటేశారు.