రైల్వేలో 64,371 ఉద్యోగాలు… టెన్త్, ఐటీఐ ఉంటే చాలు!

1155
RRB ALP recruitment 2018 group C jobs

దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 64,371 పోస్టుల భ‌ర్తీ

ఇండియన్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 64,371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ సి ఉద్యోగాల నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసారు. ఈ గ్రూప్ లోని అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) ఉద్యోగాలతో పాటు ఇతర టెక్నికల్ పోస్టులకు భారీ ఎత్తున ఖాళీలు ప్రకటించింది. పదోతరగతి, ఐటీఐ చదివినవారికి కేంద్రప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ఇది సదావకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

* గ్రూప్-సి పోస్టులు
* మొత్తం పోస్టుల సంఖ్య: 64,371
* అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు: 27795
* ఇతర టెక్నికల్ పోస్టులు: 36576

SECUNDERABAD – 5817

విభాగాలు: అసిస్టెంట్ లోకో పైలట్, ఇతర టెక్నికల్ పోస్టులు
అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 22.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేది: అక్టోబర్ 1.
వెబ్సైట్ : రైల్వే రిక్రూట్ మెంట్ కంట్రోల్ బోర్డ్ 

Youtube link for more information