టెలికాం సంస్థ రిలయన్స్ జియో దసరా, దీపావళి పండుగల సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. గతంలో మాదిరిగా ఎలాంటి ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయాల్సిన పనిలేదు. నేరుగా అదే ధరకు జియో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. జియో ఫోన్‌ను రూ.1500కు బదులుగా కేవలం రూ.699కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను కొన్న వారికి మొదటి 7 రీచార్జిలపై అదనంగా రూ.99 విలువైన మొబైల్ డేటాను రిలయన్స్ జియో ఉచితంగా అందివ్వనుంది. దీంతో ఫోన్ కొనుగోలుపై రూ.800, 7 రీచార్జిల డేటా విలువ రూ.700 కలిపి మొత్తం రూ.1500 ఆదా చేసుకోవచ్చు. కేవలం దీపావళి పండుగ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో తెలిపింది.