ఈ రోజు రాశి ఫలితాలు–బుధవారం 9 అక్టోబరు 2019

459
today horoscope details

తేది – 9 అక్టోబరు 2019 బుధవారం శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం; శుక్ల పక్షం ఏకాదశి: తె. 5.35 తదుపరి ద్వాదశి ధనిష్ఠ నక్షత్రం: రా. 12.30 తదుపరి శతభిషం వర్జ్యం లేదు దుర్ముహూర్తం: ఉ. 11.26 నుంచి 12.14 వరకు రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు సూర్యోదయం: ఉ.5-55; సూర్యాస్తమయం: సా.5.42

మేష రాశి :
ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బులు అందుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభ రాశి :
బంధువుల నుంచి కీలక సమచారం అందుకుంటారు. విలువైనన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

మిథున రాశి :
చేపట్టిన కార్యక్రమాలలో కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.

కర్కాటక రాశి :
మిత్రులతో కష్టసుఖాలు పంచుకుని, ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

సింహ రాశి :
పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవితభాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. వాహనయోగ ఉంది.

కన్య రాశి :
ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సంతానం నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు.

తుల రాశి :
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా కుటుంబసభ్యుల సహాయసహకారాలతో సకాలంలో పూర్తిచేస్తారు. ఋణ బాధలు ఎదురై చికాకులు పెడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

వృశ్చిక రాశి :
కుటుంబసభ్యులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. జీవితభాగస్వామి నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు రాశి :
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ధనలాభం పొందుతారు.

మకర రాశి :
ఇంటాబయటా పైచేయి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.

కుంభ రాశి :
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సంతానం విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు.

మీన రాశి :
చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు.