నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఎక్కడికక్కడ నాలాలు పొంగిపొర్లుతున్నాయి. కుండపోత వర్షాల నేపథ్యంలో వరద నీరు నిలిచే ప్రాంతాలపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. సహాయక చర్యలకు 45 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను రంగంలోకి దింపింది.
ఎక్కడైనా మ్యాన్‌హోల్ తెరిచి ఉంటే 155313 కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎండీ దానకిశోర్ సూచించారు.