భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన మాస్ మహారాజా

217
Raviteja Hikes his Remuneration

మాస్ మహారాజా రవితేజ ఈ సంక్రాంతికి విడుద‌లైన “క్రాక్”’తో బ్లాక్‌బ‌స్టర్ విజ‌యాన్ని సొంతం చేసుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

ఈ క్రమంలో రవితేజ తన పారితోషికాన్ని భారీగా పెంచేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు తన 68వ సినిమాకు రవితేజ రూ.16 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట.

‘క్రాక్’ సినిమాకు రవితేజ రెమ్యునరేషన్‌తో పాటు వైజాగ్ ఏరియా కలెక్షన్స్‌లో షేర్ కూడా తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కలెక్షన్లు భారీగానే వచ్చాయి.

ఈ సినిమా తరవాత రవితేజ తన రేటు భారీగా పెంచేశారని టాక్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ నిర్మాతలు కూడా రవితేజ డిమాండ్‌కు ఓకే చెప్పడంతో ఆయన రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోయిందని అంటున్నారు.

ప్రస్తుతం రవితేజ తన రెమ్యునరేషన్‌ను 60 శాతం మేర పెంచి రూ.16 కోట్లకు చేర్చారని టాక్.

కాగా నిన్న రవితేజ మరో సినిమాను ప్రకటించారు. ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోక‌ల్’ వంటి హిట్ చిత్రాల ద‌ర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్నారు.

మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు.

వివేక్ కూచిబొట్ల స‌హ నిర్మాత‌గా వ్యవహ‌రిస్తున్న ఈ మూవీకి ప్రస‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

రవితేజకు ఇది 68వ చిత్రం. “ఖిలాడి” మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.