రాధికా ఆప్టే… బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. సౌత్ సినిమాలు ఆమెకు కలిసి వచ్చాయి. రాధికా ను చూసిన వాళ్ళెవరైనా ఆమె ఓవర్ వెయిట్ గా ఉందని అనుకుంటరా చెప్పండి. అస్సలు అనుకోరు కదా. హీరోయిన్ల విషయంలో ఓవర్ వెయిట్ అంటే జీరో సైజ్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉండటమే. జీరో సైజ్ లేకుంటే అక్కడ వర్కౌట్ కాదు. జీరో సైజ్ కంటే కొద్దిగా వెయిట్ ఉండటం వలన రాధికా ఆప్టే విక్కీ డోనార్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకుందట. ఈ విషయాన్ని రాధికా స్వయంగా తెలియజేసింది. విక్కీ డోనార్ ఆడిషన్స్ కు ముందు హాలీడే ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లి..అక్కడ పార్టీలో ఫుల్ గా బీర్లు లాగించేసింది. అంతేకాదు, ఇష్టం వచ్చినంతగా తినేసిందట. ఇంకేముంది వెయిట్ పెరిగింది. విక్కీ డోనర్ వంటి హిట్ సినిమాను మిస్ చేసుకోవడంతో పాపం ఈ అమ్మడు చాలా బాధపడింది.