పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్‌టైనర్ ‘రాధేశ్యామ్’.
యూవీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీధలు భారీ బడ్జెట్‌తో “రాధేశ్యామ్” సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
జస్టిన్ ప్రభాకరన్ తెలుగు, కన్నడ, తమిళ, మళయాలీ వెర్షన్స్‌కు సంగీతం సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్‌కు మిథున్, మనన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. జూలై 30న “రాధేశ్యామ్” విడుదలవుతోంది.
పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ‘రాధేశ్యామ్’ రొమాంటిక్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ వీడియోలో “సే యున్ ఏంజిలో. దేవ్ మోరిరే పెరింట్రార్తి’ అంటూ ప్రభాస్ ఇటాలియన్‌లో పలికిన డైలాగ్ ఆకట్టుకుంది. ఈ ఇటాలియన్ డైలాగ్‌కు అర్థం “నువ్వొక దేవతవి. నిన్ను కలుసుకోవడానికి నేను చనిపోయినా పర్వాలేదు” అని.
అందుకే ఈ వీడియోలో ఆ తరువాత పూజా హెగ్డే ప్రభాస్‌ను “నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా?” అని అడిగితే.. “వాడు ప్రేమకోసం చచ్చాడు, నేనలా కాదు” అని ప్రభాస్ సమాధానం ఇచ్చారు.
డైలాగ్స్‌తో పాటు విజువల్స్, నేపథ్య సంగీతం వీడియోకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.