ప‌బ్‌జీకి సీక్వెల్‌గా కొత్త గేమ్‌

230

ప‌బ్‌జీ గేమ్‌. చిన్న పిల్ల‌లు, యువ‌తీ యువ‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ఇది. నిషేధానికి ముందు యువ‌త ఇందులో ప‌డి త‌ల‌మున‌క‌లై ఉండేవారు.

అయితే ఈ గేమ్‌ను భార‌త ప్ర‌భుత్వం నిషేధించి కొన్ని నెల‌లు అవుతోంది.

కానీ నిషేధానికి ముందే ఆ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వాళ్లు మాత్రం ఇప్ప‌టికీ ఈ గేమ్‌ను వాడుతున్నారు.

భార‌త్‌లో ప‌బ్‌జీ గేమ్‌కు కేంద్రం కొన్ని అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేసింది.

కేంద్ర ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను సరిచేసుకుంటామని చెప్పినప్పటికీ PUBG గేమ్‌కు ఇప్పట్లో అనుమతులు ఇచ్చే సూచనలు మాత్రం కనిపించట్లేదు.

కానీ ఆ సంస్థ మాత్రం తన ప్రయత్నాలను వదిలిపెట్టట్లేదు.

పాత గేమ్‌కు కొనసాగింపుగా మరిన్ని సెట్టింగ్స్ కొత్త పీచర్లతో PUBG న్యూ స్టేట్ గేమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

తాజాగా ఈ గేమ్ గురించి కొత్త సమాచారం బయటకు వచ్చింది. పబ్జీ పేరెంట్ కంపెనీ క్రాఫ్టాన్ కొత్త గేమ్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

PUBG న్యూ స్టేట్ గేమ్‌కు సంబంధించిన వెబ్‌సైట్ సోర్స్ కోడ్‌ హిందీ లాంగ్వేజ్ వెర్షన్‌కు కూడా మద్దతు ఇస్తోంది.

ప్రస్తుతానికి హిందీ భాషను డిసేబుల్ చేసినట్టు కనిపిస్తోంది.

దీంతో ఈ గేమ్‌ను మన దేశంలో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని పబ్జీ అభిమానులు సంతోషిస్తున్నారు.

అసలైన పబ్జీ గేమ్‌కు సీక్వెల్‌గా పబ్జీ న్యూ స్టేట్ గేమ్‌ను అభివృద్ధి చేశారు. కొత్త గేమ్‌లో బ్యాటిల్ గేమ్ ప్లే పూర్తి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కానీ PUBG న్యూ స్టేట్ గేమ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. మన దేశంలో దీన్ని లాంఛ్ చేస్తారో లేదో కూడా తెలియదు.

భారత్‌లో కొత్త గేమ్ ప్రీ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించలేదు. కానీ హిందీ భాషకు వెబ్‌సైట్ మద్దతు ఇస్తోందనే వివరాలను ఒక గేమింగ్ బ్లాగ్ లీక్ చేసింది.

దేశ సమగ్రతకు నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో 250 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ జాబితాలో పబ్జీ కూడా ఉంది.

నిషేధం నుంచి బయట పడటానికి PUBG కార్పొరేషన్ ప్రత్యేకంగా పబ్జీ మొబైల్ ఇండియా గేమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

భారత్‌లో ప్రత్యేకంగా పబ్జీ ఇండియా సంస్థను కూడా ఏర్పాటు చేసింది. ఆ సంస్థ అధికారులు కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం వేచిచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో పబ్జీ కార్పొరేషన్‌ను క్రాఫ్టాన్ సంస్థ కొనుగోలు చేసింది. కంపెనీకి చైనా గేమింగ్ ప్లాట్‌ఫాంలతో ఉన్న సంబంధాలను తెంచుకుంది.

ఆ తరువాత పబ్జీ ఇండియా పేరుతో మన దేశంలో సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేసింది.

కేంద్ర ప్రభుత్వం మాత్రం PUBGకి అనుమతులు ఇచ్చే విషయంలో పునరాలోచించట్లేదు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు PUBG మొబైల్ గేమ్‌పై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.

దీనికి తోడు ఈ గేమ్ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరిపై ప్రతికూల ప్రభావం చూపుతోందనే ఆరోపణలు వచ్చాయి.

అందువల్ల పబ్జీని నిషేధించినా ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోన‌క‌ర్లేదు.

ఇవన్నీ పరిశీలిస్తే క్రాఫ్టాన్ భారత్‌లో PUBG న్యూ స్టేట్ లేదా మరో కొత్త గేమ్‌ను ప్రారంభించే అవకాశాలు కనిపించట్లేదని అధికారులు విశ్లేషిస్తున్నారు.