ఆ డైరెక్టర్ ప్యాంటీ కన్పించాలన్నాడు… ప్రియాంక చోప్రాకు చేదు అనుభవం

221
Priyanka Chopra makes a big revelation about a director

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన జీవితానికి సంబంధించి ‘అన్‌ఫినీష్‌డ్’ (Unfinished) అనే పేరుతో ఓ పుస్తకం విడుదల చేసింది. ఇందులో ఆమె ప్రస్తావించిన అంశాలు కొన్ని వివాదాస్పద అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఫిబ్రవరి 9న (మంగళవారం) Unfinished పుస్తకం విడుదలైంది.

ఈ పుస్తకంలో యూపీలోని ఓ చిన్న గ్రామం నుంచి సినీ రంగ ప్రవేశం, మిస్ వరల్డ్ టైటిల్ దక్కించుకొనే వరకు పలు విషయాలను వెల్లడించింది.

అంతేకాదు తన సినిమా షూటింగ్స్‌లో తనకు ఎదురైన ఇబ్బందులను ఓపెన్‌గా వివరించింది ప్రియాంక చోప్రా. కెరీర్ ఆరంభంలో ఓ దర్శకుడితో ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది.

ఓ ఐటెం సాంగ్ చిత్రీకరణలో భాగంగా ఓ బాలీవుడ్ డైరెక్టర్ తనను దుస్తులు ఊడదీయమన్నాడని పేర్కొంది.

ఒక్కొక్క షాట్‌లో ఒక్కో వస్త్రం వదిలేస్తూ నీ ప్యాంటీ కనిపించాలని ఆయన చెప్పాడు.

అయితే అందుకు నిరాకరిస్తూ శరీరం కనిపించకుండా చర్మ రంగుతో ఉండే దుస్తులను వేసుకొంటానని ఆ డైరెక్టర్‌తో చెప్పగా, ఆయన కోపంతో ఊగిపోయాడు.

దాంతో తనకు కూడా కోపం వచ్చి ఆ సినిమా నుంచి తప్పుకున్నానని ప్రియాంక వెల్లడించింది.

ఈ విషయంలో సల్మాన్ జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం సద్దుమణిగిందని చెప్పుకొచ్చింది. అయితే బాలీవుడ్ ను ఇప్పటికే మీటూ ఓ ఊపు ఊపేసింది.

తాజాగా ప్రియాంక చోప్రా కూడా ఇలాంటి విషయాన్నే ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాగా ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా సత్తా చాటుతోంది.

అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లాడిన ఆమె, ఆ తర్వాత కూడా కెరీర్ ఫుల్ జోష్ లో నడుస్తోంది.