నిన్నిలా నిన్నిలా : “ప్రాణం నిలవదే” లిరికల్ వీడియో సాంగ్

289
Pranam Nilavadhe Second Single from Ninnila Ninnila

‘సూధు కవ్వుమ్’, ‘ఓహ్ మై కడావులే’ వంటి తమిళ చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ తమిళ నటుడు అశోక్ సెల్వన్.

ఈ టాలెంటెడ్ నటుడు ‘నిన్నిలా నిన్నిలా’ అనే చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు.

రీతూ వర్మ, నిత్యా మీనన్‌ లు ఈ “నిన్నిలా నిన్నిలా” చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి Ani.I.V.Sasi దర్శకత్వం వహిస్తుండగా… బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రాజేష్ మురుగేశన్ ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి “ప్రాణం నిలవదే” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

అశోక్ సెల్వన్, రీతూ వర్మలపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్ ను యాజిన్ నిసార్, కళ్యాణి నాయర్, రాజేష్ మురుగేశన్ ఆలపించగా శ్రీమణి లిరిక్స్ అందించారు.

యూత్ ను బాగా ఆకట్టుకుంటున్న ఈ లిరికల్ వీడియోను మీరు కూడా వీక్షించండి.

రొమాంటిక్ కామెడీ చిత్రం “నిన్నిలా నిన్నిలా” ట్రైలర్ ఇటీవలే విడుదల చేశారు. ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.

అశోక్ సెల్వన్ దేవ్ అనే చెఫ్ పాత్రలో కన్పిస్తాడు. అయితే అతనికి కండరాల నొప్పికి సంబంధించిన విచిత్రమైన జబ్బు ఉంటుంది. నాజర్ రెస్టారెంట్ హెడ్ చెఫ్ గా కనిపిస్తుండగా, రీతూ వర్మ కో-చెఫ్ తారా అనే పాత్ర పోషిస్తోంది.

ఇక నిత్యామీనన్ చిన్న పిల్లల మనస్తత్వం ఉన్న మాయ అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 26 న విడుదల కానుంది.