ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… టీజర్ పై క్లారిటీ ఇచ్చిన బుట్టబొమ్మ

216
Pooja Hegde dubs for the Teaser of Radhe Shyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు బుట్టబొమ్మ పూజాహెగ్డే గుడ్ న్యూస్ చెప్పింది.

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా “రాధేశ్యామ్” తెరకెక్కుతోంది.

1960 దశకం నాటి ఈ వింటేజ్‌ ప్రేమకథా చిత్రాన్ని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

“రాధేశ్యామ్” చిత్రంలో సీనియర్ హీరోయిన్ సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రభాస్ 20వ చిత్రమైన “రాధేశ్యామ్”పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా ప్రేమికుల రోజున “రాధేశ్యామ్” నుంచి సర్ప్రైజ్ రానుందని తెలుపుతో మేకర్స్ ఇటీవలే కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ మేరకు కొత్త పోస్టర్ షేర్ చేస్తూ ఫిబ్రవరి 14న “రాధేశ్యామ్” గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

అయితే తాజాగా పూజాహెగ్డే చేసిన ట్వీట్ ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతేసేలా చేసింది. .

“ఉదయాన్నే చిత్ర టీజర్‌ కోసం డబ్బింగ్‌ స్టార్ట్‌ చేశాను. ఫిబ్రవరి 14న టీజర్‌తో వచ్చేస్తున్నాం” అని పూజా తన ట్వీట్‌లో పేర్కొంది.

చిత్ర యూనిట్ అఫీషియల్ గా టీజర్ రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయిన పూజా హెగ్డే తన ట్వీట్ ద్వారా టీజర్ రాబోతోందని చెప్పేసింది.