లాట్‌ మొబైల్స్‌కు ప్రచారకర్తగా అందాల భామ పూజా హెగ్డే

1632
LOT mobiles

ప్రముఖ నటి పూజా హెగ్డేను ప్రచారకర్తగా నియమించుకుంటున్నట్లు మొబైల్ విక్రయ సంస్థ లాట్ మొబైల్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ..స్మార్ట్ మొబైల్ విక్రయ రంగంలో విజయపథంలో దూసుకుపోతున్న సంస్థకు క్రేజీ హీరోయిన్ పూజా ప్రత్యేక ఆకర్షణ అవుతుందన్నారు. తెలుగు ప్రజల మన్నలను పొందుతున్న లాట్‌కు ప్రచారకర్తగా వ్యవహరించడం సంతోషంగాను, గర్వంగాను ఉన్నదని పూజా హెగ్డే ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం సంస్థ తెలుగు రాష్ర్టాల్లో 165 రిటైల్ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్నది.




 

తమ అన్ని షోరూంలను అత్యాధునిక సదుపాయాలతో పాటు ప్రముఖ మొబైల్ మెడల్స్ యొక్క టచ్, ఫీల్ ఎక్స్‌పీరియన్స్‌ను లైవ్ డెమోస్ ద్వారా వినియోగదారులకు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. లాట్ అంటే స్మార్ట్.. స్మార్ట్ అంటే లాట్.. అనే స్థాయిలో తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలలో ఓ ప్రత్యేక స్థాయినీ, స్థానాన్నీ పొందగలిగామని, ఇది తమకెంతో ఆనందంగా వుందని అన్నారు.

ఈ సందర్భంగా లాట్ ప్రోమో ను విడుదల చేసారు . ఆ వీడియో చూద్దాం

ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తాము 165 షోరూంలలో ఉన్నత వ్యాపార విలువలతో ఉత్తమమైన సర్వీసుతో, ఆనందాశ్చర్యాలను కలిగించే ఆఫర్లతో ప్రజల మన్నలందుకుంటూ, లాట్ మొబైల్స్.. అభివృద్ధి పొందుతున్న తీరు అపురూపంగా ఉందని, ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కావడం ఎంతో సంతోషంగాను, గర్వంగానూ ఉందని, సంస్థ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా పూజా హెగ్డే ఈ సందర్భంగా తెలియజేశారు.