పందులు, కుక్కల కుస్తీ పోటీలు

337

అది జోగులాంబ గ‌ద్వాల జిల్లాలోని అయిజ అనే ఊరు. ఆ ఊరిలో ప్ర‌తి ఏటా శ్రీ‌తిక్క‌ వీరేశ్వ‌ర‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతాయి.

అయితే ఈ ఉత్స‌వాల‌లో ఓ ప్ర‌త్యేక‌మైన పోటీలు కూడా జ‌రుగుతాయి. అవునండీ! పందుల‌కు, కుక్క‌ల‌కు కుస్తీ పోటీలు జ‌రుగుతాయి.

ఏపీలో సంక్రాంతికి కోళ్ల పందాల మాదిరి అన్న‌మాట‌. ఈ పోటీలు జ‌నాల‌ను రంజింప‌జేసేందుకు మాత్ర‌మే కాదు భారీగా ప్రైజ్‌మ‌నీ కూడా ఇస్తారు.

ప్రథమ బహుమతి పొందిన పందికి రూ. 30,016 ఇస్తారు. మరి కుక్కల పోటీ తక్కువేం కాదు.

పోటీలో గెలుపొందిన కుక్కకు రూ. 15,016 ఫ్రైజ్‌ మనీ ఇస్తున్నారు.

1960 నుంచి ప్రతీ యేడాది శ్రీతిక్క వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

ఈ ఏడాది మార్చి 1న ప్రారంభమైన ఉత్సవాలు 11వ తేదీ వరకు జ‌రుగుతాయి.

అయితే ప్రతీ యేడాది జరిగే పెంపుడు జంతువుల ప్రద్శన పోటీలు ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ప్రధానంగా పందుల బల ప్రదర్శన పోటీలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పందులు, కుక్కలను తీసుకుని వస్తున్నారు.

రింగ్‌లోకి దిగిన పందులు హోరా హోరీగా తలపడుతుంటే ఆడియన్స్‌ కేరింతలు కొడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

పోటీల్లో పాల్గొనేందుకు వచ్చే వారికి, జ‌నాల‌కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు.

మంచినీరు, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించారు.

మరి ఈ పందులను డైరెక్ట్‌గా బరిలో దింపరు. వాటికి ఇవ్వాల్సిన ట్రైనింగ్, ఫిట్నెస్ శిక్ష‌ణ ఇచ్చి బరిలోకి దింపుతారు.

పందులకు ప్ర‌తి రోజూ రాగులు, ఉలువలు, జొన్నలు వంటి బలమైన ఆహారాన్ని పెడ‌తారు. రోజూ వాకింగ్‌ కూడా చేయిస్తారు.

ఆహారం కోసం ఒక్కో పందిపై రోజుకు రూ. 500 ఖర్చు చేస్తామని యజమానులు చెబుతున్నారు.