
రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే క్రూరంగా ప్రవర్తించడంతో ఓ చిన్నారి పాప బలైంది.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంభి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
హాస్పిటల్ బిల్లులు పూర్తిగా చెల్లించలేదన్న కారణంతో సర్జరీ తర్వాత కుట్లు వేయకుండా పాపను కుటుంబసభ్యులకు అప్పగించటంతో ప్రాణాలు కోల్పోయింది.
చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కౌశాంభి జిల్లా మన్‌ఝాన్‌పూర్ టౌన్‌కు చెందిన మూడు సంవత్సరాల ఓ చిన్నారికి కొద్దిరోజుల క్రితం కడుపులో నొప్పి రావటంతో ప్రయాగ్ రాజ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పాపను పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో ఆపరేషన్ చేశారు.
అయితే పాప తల్లిదండ్రులు హాస్పిటల్ బిల్లులు మొత్తం చెల్లించాలేదు.దీంతో సర్జరీ చేసిన చోట కుట్లు వేయకుండానే పాపను కుటుంబసభ్యులకు అప్పగించారు.
దీంతో పాప ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వివరాలను ఓ వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయటంతో సంఘటన నేట్టింట్లో వైరల్ అయింది.