పెళ్ళిళ్లలో ఫోటోలు, వీడియోల సందడి అంతా ఇంతా ఉండదు. ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తమ క్రియేటివిటీని చూపించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు.
కానీ ఒక్కోసారి ఇది బెడిసి కొడుతుంది కూడా. ఒక నూతన జంట ప్రీ వెడ్డింగ్ షూటింగ్ లో నీటిలో పడి చనిపోయిన విషయం తెలిసిందే.
ఓ పెళ్లి వేడుకలో ఫోటోగ్రాఫర్ ఓవర్ యాక్షన్ చేసి దెబ్బలు తిన్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మిడియాలో వైరల్ అవుతుంది. వధూవరులు స్టేజిపై నిల్చుని ఉండగా.. ఫోటోగ్రాఫర్ వరుడిని వదిలేసి వధువును క్లోజ్ గా ఫోటోస్ తీస్తున్నాడు. అలా తీస్తూ మరీ ఓవర్ చేశాడు.
పెళ్లి కూతురు ముఖాన్ని అటు ఇటు తిప్పమని మరింత క్లోజ్ ఫోటోలు తీస్తున్నాడు. దీంతో వరుడికి మండి లాగి పెట్టి ఒక్కటిచ్చాడు. అప్పటివరకు సిగ్గుతో తల దించుకున్న వధువు కింద పడి మరీ పగలబడి నవ్వింది.
I just love this Bride 👇😛😂😂😂😂 pic.twitter.com/UE1qRbx4tv
— Renuka Mohan (@Ease2Ease) February 5, 2021
జరిగిన తంతు చూసి ఎం చేయాలో అర్థం కాక దెబ్బలు తిన్న ఫొటోగ్రాఫర్ కూడా నవ్వాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా నవ్వాపుకోలేకపోతున్నారు.
ఇది కావాలని ప్రాంక్ చేసారా లేదా నిజంగానే సడన్ గా జరిగిందా వీడియో చుస్తే గాని అర్థం కాదు.