ఒప్పో ఫైండ్ ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

342
Oppo Find X smart phone released

తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ఒప్పో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్‌లోకి ఒప్పో ఫైండ్ ఎక్స్‌పాటు స్లైడర్ కెమెరా గల స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. ఇండియాలో ఈ ఫోన్ ధర రూ. 59,990గా నిర్ణయించినట్లు ఒప్పో సంస్థ వెల్లడించింది. ఆగస్టు 3వ తేదీ నుంచి ఒప్పో ఫైండ్ ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.Oppo Find X specifications

ఒప్పో ఫైండ్ ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 3730ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌వోసీ, ఆండ్రాయిడ్ 8.1, 6.42 అంగుళాల పూర్తి హెచ్‌డీ, 19.5:9 రేషియో, 20 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెకండ్ సెన్సార్ కెమెరా, మైక్రో ఎస్డీ కార్డు సౌకర్యాలు ఈ ఫోన్‌కు ఉంటాయని కంపెనీ వెల్లడించింది.