ఎన్‌టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పీజీడీఎం కోర్సులు

505
PGDM courses in NTPC School of business

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) స్కూల్ ఆఫ్ బిజినెస్ పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.కోర్సులు-అర్హతలు:పీజీడీఎం (ఎగ్జిక్యూటివ్)
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ/బీఈ/బీటెక్ లేదా సీఏ లేదా ఐసీడబ్ల్యూఏతోపాటు క్యాట్/జీమ్యాట్‌ల్లో వ్యాలిడ్ స్కోర్ లేదా ఎన్‌ఎస్‌బీ ఆన్‌లైన్ టెస్ట్ ఉత్తీర్ణత. 2018, జూలై 31 నాటికి కనీసం ఐదేండ్ల పని అనుభవం ఉండాలి.
-కాలవ్యవధి : 15 నెలలు
-పీజీడీఎం (ఎనర్జీ మేనేజ్‌మెంట్)
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ/బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. క్యాట్/జీమ్యాట్ లేదా ఎక్స్‌ఏటీలో వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి లేదా ఎన్‌ఎస్‌బీ ఆన్‌లైన్ టెస్ట్‌లో అర్హత సాధించి ఉండాలి.
-కాలవ్యవధి: రెండేండ్లు
-నోట్: పై రెండు కోర్సులు ఫుల్‌టైం రెగ్యులర్ కోర్సులు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: పీజీడీఎం (ఎగ్జిక్యూటివ్)- జూలై 15
-పీజీడీఎం (ఎనర్జీ మేనేజ్‌మెంట్)- జూలై 31
-వెబ్‌సైట్: www.nsb.ac.in/ www.nsbnoida.ac.in