చెక్ : “నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను..” వీడియో సాంగ్

564
Ninnu Chudakunda Video Song from Check​​​

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “చెక్”.

వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న “చెక్” చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్న “చెక్” చిత్రంలో సిమ్రాన్ చౌదరి, పోసాని కృష్ణ మురళి, సాయి చంద్, మురళి శర్మ, హర్ష వర్ధన్, సంపత్ రాజ్, రోహిత్ తదితరులు నటిస్తున్నారు.

ఇక ప్రియా వారియర్ కు తెలుగులో “చెక్” మొదటి చిత్రం కావడం విశేషం. కాగా “చెక్” చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి “నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను” అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

కళ్యాణీ మాలిక్ స్వరాలకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, హరిచరణ్, శక్తిశ్రీ గోపాలన్ ఆలపించారు. గోవాలోని అందమైన సాగర తీరంలో ఈ పాట చిత్రీకరణ జరిగింది.

యూత్ ను బాగా ఆకట్టుకుంటున్న “నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను..” వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.