ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించనున్నట్టు స్వయంగా వెల్లడించింది.
ఈ విషయమై నిధి మాట్లాడుతూ.. “అవును.. నేను పవన్ కల్యాణ్ సినిమాలో నటిస్తున్నాను. ఇది నా తొమ్మిదో సినిమా. పవన్ కళ్యాణ్ అద్భుతమైన వ్యక్తి. ఆయనంటే నాకు చాలా అభిమానం. అందుకే ఆయనతో వర్క్ చేయాలని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను.
ఇంతటి అద్భుతమైన అవకాశం రావడంతో నా కల నిజమైనట్టు అనిపిస్తోంది” అంటూ చెప్పుకొచ్చింది.
పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ భారీ బడ్జెట్ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఏఎమ్ రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి ఒక హీరోయిన్‌గా ఎంపికైంది. ఇప్పటికే షూటింగ్‌లో కూడా పాల్గొంది.
ప్రస్తుతం పవన్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో నటిస్తున్నాడు. వచ్చే నెలలో ఆ రీమేక్ ను పూర్తి చేసి పవన్ క్రిష్ మూవీలో జాయిన్ కాబోతున్నాడు. ఈ సినిమాని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.
ఇక నిధి విషయానికొస్తే… సవ్యసాచి చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నిధి టాలీవుడ్ లో ఇప్పటి వరకు పలు చిత్రాల్లో నటించినప్పటికీ “ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో హిట్ అందుకుంది.
అయితే నిధి అగర్వాల్ కు ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. మరి పవన్ తో చిత్రం ఈ అందాల నిధికి కలిసొస్తుందేమో చూడాలి.