మెగాస్టార్ సోదరిగా లేడీ సూపర్ స్టార్ ?

189
Nayanthara's crucial role in Chiranjeevi's Lucifer

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా తరువాత “లూసిఫర్” రీమేక్ లో నటించనున్నారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన “లూసిఫర్” సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.

తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.

ఈ సినిమాలో హీరో సోదరి పాత్ర అత్యంత కీలకం. దీంతో ఆ పాత్ర కోసం కీర్తి సురేష్ పేరు విన్పించింది.

కానీ తాజా సమాచారం ప్రకారం ఆ పాత్ర కోసం పలువురు ప్రముఖ హీరోయిన్ల పేర్లను పరిశీలించిన మేకర్స్ చివరికి నయనతారను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

నయన్ కూడా ఆ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక సినిమాలో నయన్ భర్త పాత్ర పోషించే నటుడి విషయంలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

త్వరలోనే ఈ సినిమాలో నటీనటుల గురించి అధికారిక ప్రకటన వస్తుందట. మార్చి నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.