జెర్సీ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో24వ చిత్రంగా రూపొందుతున్న గ్యాంగ్ లీడర్ అనే చిత్రం చేస్తున్నాడు. నాని ఈ మూవీని ఆగస్ట్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో అయిదుగురు అమ్మాయిలు దొంగలుగా ఉంటారని వారికి నాయకుడిగా నాని ఉంటారనే టాక్ నడుస్తుంది. ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. ప్రియాంక అరుల్‌మోహన్, లక్ష్మీ , శరణ్య, అనీష్ కురువిళ్ళా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, సత్య తదిదరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
కొద్ది సేపటి క్రితం చిత్ర ప్రీ లుక్ విడుదల చేశారు మేకర్స్ . ఇందులో నాని చేతిలో చేయి వేసి ఐదుగురు అమ్మాయిలు ప్రమాణం చేస్తున్నట్టుగా ఉంది. ఈ ప్రీ లుక్‌తో చిత్రానికి సంబంధించి మిగతా వివరాలు కూడా వెల్లడించారు. ఫస్ట్ లుక్ జూలై 15,ఫస్ట్ సాంగ్ జూలై 18, టీజర్ జూలై 24న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు . ఈ సినిమా పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుందని టీం చెబుతుంది.
We MET
We are READY
We are the GANG
&
I AM#GANGLEADER 🖐🏼👊🏼 @Vikram_K_Kumar @MythriOfficial @anirudhofficial @priyankaamohan pic.twitter.com/l7ZO7C2Le7— Nani (@NameisNani) July 13, 2019