బాలయ్య 108వ సినిమా అప్డేట్

157
Nandamuri Balakrishna Movie With B Gopal

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత బాలకృష్ణ పలువురు దర్శకులతో చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి.

తాజాగా బాలయ్య, మాస్ డైరెక్టర్ బి గోపాల్ సినిమా అప్డేట్ వచ్చేసింది. బాలయ్యకు ఇది 108వ సినిమా. తాజాగా దీనికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వచ్చింది.

ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ ను అందిస్తున్నారు. మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

గతంలో బి గోపాల్ దర్శకత్వంలో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు.

వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా పల్నాటి బ్రహ్మనాయుడు. ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇన్నాళ్ల తరువాత బాలకృష్ణతో కలిసి సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు బాలయ్య.

ప్రస్తుతం బాలకృష్ణ మాస్ దర్శకుడు బోయపాటితో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి అయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమా తరువాత బాలయ్య… క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత బాలయ్య, బి గోపాల్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.