కొత్త కొత్త ఫీచర్స్‌తో ఉండే ఫోన్లంటే చాలా మంది ఇష్టపడతారు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త స్మార్ట్ ఫోన్ మోటో ఈ7 పవర్‌ను భారత్‌లో మార్కెట్‌లోకి విడుదల చేసింది.
రూ.7,499 నుంచి దీని ధర ప్రారంభం అవుతుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఇందులో అందించారు. ఇందులో వాటర్ డ్రాప్ తరహా డిస్ ప్లే ఉంటుంది. వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి.
స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని ఈ ఫోన్ అందిస్తుంది. ఒక్కసారి చార్జ్ పెడితే రెండురోజుల పాటు దీన్ని ఉపయోగించవచ్చు. రెడ్ మీ 9ఐ, ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 5, రియల్ మీ సీ15లతో ఈ ఫోన్ పోటీ పడుతోంది.
మోటో ఈ7 పవర్ ధర
ఈ కంపెనీ రెండు వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభ వేరియంట్ 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో రూ.7,499గా ధరను నిర్ణయించారు.
ఇక రెండోది 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్. ధర రూ.8,299గా ఉంది. కోరల్ రెడ్, టహిటి బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ సేల్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
స్పెసిఫికేషన్లు:
ఈ ఫోను 6.5 అంగుళాల హెచ్‌డీ+ మ్యాక్స్ విజన్ డిస్ ప్లేను కలిగివుంటుంది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిజల్యూషన్ 1,600×720 పిక్సెల్స్‌గా ఉంటుంది.
మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
దీని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉండనుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉంచారు.
10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 76 గంటల పాటు మ్యూజిక్ స్ట్రీమింగ్, 14 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్, 12 గంటల వెబ్ బ్రౌజింగ్‌ను ఈ ఫోన్ సింగిల్ చార్జ్‌లో అందింస్తుంది.
దీని మందం 0.92 సెంటీమీటర్లు కాగా, బరువు 200 గ్రాములుగా ఉండనుంది.