చలసాని శ్రీనివాస్ కూతురు శిరీష్మ ఆత్మహత్య
ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పుత్రిక శోకం కలిగింది. ఆయన కూతురు శిరీష్మ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
2016లో శిరీష్మకు సిద్ధార్థ్ అనే వ్యక్తితో వివాహమైంది. భర్తతో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కాపురముంటున్నారు. శిరీష్మ ఆత్మహత్య కుటుంబసభ్యులను షాక్‌కు గురి చేసింది.
శిరీష్మ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహమై నాలుగేళ్లయినా వీరికి సంతానం లేకపోవడంతో శిరిష్మ తీవ్ర డిప్రెషన్‌కు లోనయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాత్రి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని శిరిష్మ ఆత్మహత్య చేసుకున్నారు.
రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన సిద్ధార్థ్.. ఉరేసుకున్న శిరిష్మను చూసి కిందకి దింపి చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.